అకాల మరణం చెందిన మూశం సారంగపాణి కుటుంబానికి రూ.57 వేల ఆర్థిక సాయం

అకాల మరణం చెందిన మూశం సారంగపాణి కుటుంబానికి రూ.57 వేల ఆర్థిక సాయం వరంగల్, నవంబర్ 4: వరంగల్‌లోని కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన మూశం సారంగపాణి ఇటీవల అకాల మరణం చెందడంతో, ఆయన కుటుంబానికి అండగా నిలిచేందుకు చిన్ననాటి మిత్రులు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా కాశిబుగ్గకు చెందిన సారంగపాణి చిన్ననాటి మిత్రులు అందరూ కలిసి రూ.57,000 ఆర్థిక సహాయాన్ని సేకరించి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఆపద సమయంలో స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన చిన్ననాటి మిత్రులను ఈ సందర్భంగా అభినందించారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు...