*ఎస్సైలు, స్టేషన్ రైటర్లకు 12 రోజుల ప్రత్యేక శిక్షణ పూర్తి*
వరంగల్ పోలీస్ కమిషనరేట్ తేదీ: 04-11-2026 *ఎస్సైలు, స్టేషన్ రైటర్లకు 12 రోజుల ప్రత్యేక శిక్షణ పూర్తి* వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎస్సైలు, స్టేషన్ రైటర్లకు కేసుల దర్యాప్తు, కోర్టు విధానాలపై నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో అక్టోబర్ 22న ప్రారంభమైన 12 రోజుల ప్రత్యేక శిక్షణ తరగతులు నవంబర్ 4న ముగిశాయి. ఈ శిక్షణలో భాగంగా కేసుల దర్యాప్తు విధానం, శాస్త్రీయ ఆధారాల సేకరణ, సాక్షుల విచారణ, వివిధ శాఖల నుంచి అవసరమైన ఆధారాల సేకరణ, చార్జిషీట్ల తయారీ, కోర్టులో సాక్షుల హాజరు, పటిష్టమైన ఆధారాలతో నేరస్థులకు శిక్షలు పడేలా కేసులను నిరూపించడం వంటి కీలక అంశాలపై శిక్షణ అందించారు....