వంచనగిరి సాయిబాబా ఆలయంలో గురువారం ప్రత్యేక అలంకరణ.. విశేష పూజలు
వంచనగిరి సాయిబాబా ఆలయంలో గురువారం ప్రత్యేక అలంకరణ.. విశేష పూజలు వరంగల్, నవంబర్ 5: వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై వంచనగిరి ప్రాంతంలో కొలువుదీరిన కోటగండి కొండగిరి సాయిబాబా దేవాలయంలో గురువారం ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం సాయిబాబాకు అత్యంత ప్రీతికరమైన రోజుగా భావించే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిబాబాను వివిధ పుష్పాలతో, ఆకర్షణీయమైన అలంకరణలతో సుందరంగా అలంకరించారు. స్వామివారి దివ్య రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, సాయిబాబా నామస్మరణతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. భక్తులు స్వామివారికి పూజలు నిర్వహించి, తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని,...