కల్తీ కారం, పసుపు పొడి నిల్వలపై టాస్క్‌ఫోర్స్ దాడి

కల్తీ కారం, పసుపు పొడి నిల్వలపై టాస్క్‌ఫోర్స్ దాడి రూ.5.92 లక్షల విలువైన కల్తీ ఆహార పదార్థాలు స్వాధీనం – ఒకరి అరెస్ట్ వరంగల్, నవంబర్ 5: వరంగల్ నగరంలోని మట్వాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో కల్తీ ఆహార పదార్థాల నిల్వలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఆహార భద్రతా శాఖ అధికారులతో కలిసి దాడి నిర్వహించారు. ఈ దాడిలో కల్తీ కారం పొడి, పసుపు పొడిని నిల్వ ఉంచిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని, మొత్తం రూ.5,92,500 విలువైన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించి, నిందితుడి వద్ద ఉన్న 600 కిలోల కారం పొడి, 1,650 కిలోల పసుపు...