*ప్రభుత్వ నిబంధనలు ఎవరికి పట్టవా? బాణాసంచా దుకాణాలతో ప్రజల్లో కలకలం*
*అధికారులకు చేతివాటాలే కారణమా అనే అనుమానాలు* *షాపుకు షాపుకు మధ్య 9 ఫీట్ల డిస్టెన్స్ నిబంధనకు ఆర్డీవో త్రిలోధకాలు* *గుట్టుచప్పుడు కాకుండా ఆర్డీవో అనుమతులు* *బాణాసంచా నిల్వలు అమ్మకదారుల ఇండ్లలోనే డంపింగులు* *ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ప్రజల ప్రాణాలకు రక్షణెవరు*? *బాణాసంచా అమ్మకదారుల ఇళ్లల్లో టాస్క్ ఫోర్స్ అధికారులు సోదాలు నిర్వహించాలని స్థానికుల విన్నపం* జన చరిత్ర (మహబూబాబాద్ జిల్లా) బ్యూరో తొర్రూర్, నవంబర్ 07 మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీలో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి బాణాసంచా అమ్మకాలకు అనుమతులు ఇచ్చిన తొర్రూర్ ఆర్డీవో తీరు చూస్తుంటే కంచె చేను మేస్తే కాపు ఎవరు అన్న చందంగా ఉండడం ప్రజల్ని ఆందోళన గురిచేస్తుంది....