శాంతినగర్ బ్రిడ్జి వద్ద గుంతతో ప్రజలకు ఇబ్బందులు రెండు నెలలుగా పూడ్చని గుంత.. ప్రమాదాలకు అవకాశం

శాంతినగర్ బ్రిడ్జి వద్ద గుంతతో ప్రజలకు ఇబ్బందులు రెండు నెలలుగా పూడ్చని గుంత.. ప్రమాదాలకు అవకాశం వరంగల్: శాంతినగర్ బ్రిడ్జి సమీపంలో నల్లా లీకేజీ మరమ్మతుల కోసం తవ్విన గుంతను ఇప్పటివరకు పూడ్చకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లీకేజీ మరమ్మతులు పూర్తయినప్పటికీ గత రెండు నెలలుగా గుంతను అలాగే వదిలేయడంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు. ప్రధాన రాకపోకలు జరిగే ప్రాంతంలో గుంత ఉండటంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి గుంతను పూడ్చి రహదారిని ప్రయాణానికి అనుకూలంగా...