భారతదేశమంతటా వైభవంగా దీపావళి సంబరాలు

భారతదేశమంతటా వైభవంగా దీపావళి సంబరాలు ఇంటింటా దీపాల వెలుగులు.. సంప్రదాయ నోములు.. ఆధ్యాత్మిక శోభ భారతదేశం: దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు. ఇంటింటా దీపాలు వెలిగిస్తూ, విద్యుత్ దీపాల కాంతులతో ఇళ్లను అందంగా అలంకరిస్తూ పండుగ శోభను చాటుతున్నారు. పండుగ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, కుటుంబ ఆచారాలకు అనుగుణంగా దీపావళి నోములు నోచుకుంటున్నారు. సంప్రదాయ నోములు, వ్రతాలు, పూజా కార్యక్రమాలతో ఇళ్లలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటోంది. లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తూ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తున్నారు....