తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా బంక కుమారస్వామి నియామకం

పత్రికా ప్రకటన తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా బంక కుమారస్వామి నియామకం వరంగల్: తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా అబ్బనికుంటకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు, తెలంగాణ ఉద్యమకారుడు బంక కుమారస్వామిని నియమిస్తున్నట్లు వేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమల్ల రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అబ్బనికుంట ప్రాంతానికి చెందిన బంక కుమారస్వామి ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని, అనేక ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. వారి ఉద్యమ సేవలను గుర్తించి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బంక కుమారస్వామి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుల...