అనాజిపురం గ్రామంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం

ఆర్.బి.ఐ గుర్తింపు సంస్థలోనే పొదుపు చేయాలి. ఈరోజు మోత్కూరు మండలంలోని అనాజిపురం గ్రామంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్బిఐ మేనేజర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ అప్డేట్ చేసుకొని ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేయాలని సూచించారు. ఆర్.బి.ఐ గుర్తింపు పొందిన సంస్థలోనే డబ్బులు దాచుకోవాలని ప్రైవేట్ వ్యక్తులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఎస్ ఎస్ టి కౌన్సిలర్ యుగంధర్ సర్పంచ్ బీసు వెంకటయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..