పరకాలలో SIR ప్రక్రియపై BLAలకు అవగాహన
వరంగల్ జిల్లా/పరకాల, ఆగస్టు 19: ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రతి అర్హుడి ఓటు హక్కును పరిరక్షించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ అన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన పరకాల టౌన్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో SIR ప్రక్రియ, డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై BLAలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ ఇంచార్జీలు, MLC శంకర్ నాయక్, మహమ్మద్ నాసర్తో కలిసి అయూబ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై బూత్ లెవల్ ఏజెంట్లకు సమగ్ర అవగాహన కల్పించారు. ఓటర్ల వివరాల...