కనకదుర్గ కాలనీ పార్కును మోడల్ పార్కుగా తీర్చిదిద్దుతాం : ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి
కనకదుర్గ కాలనీలోని GWMC పార్కు, కమ్యూనిటీ సెంటర్‌ను వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదివారం సందర్శించారు. పార్కులోని వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, లైటింగ్, పచ్చదనం, మొక్కల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. పార్కుకు వచ్చిన వాకర్స్, స్థానికులతో మాట్లాడి అక్కడి సమస్యలు, వారి అవసరాలను తెలుసుకున్నారు. *ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి గార్లు మాట్లాడుతూ,* కనకదుర్గ కాలనీ పార్కును ఆధునిక సౌకర్యాలతో మోడల్ పార్కుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని GWMC అధికారులకు సూచించారు. వర్షాకాలంలో వాకింగ్ ట్రాక్‌పై నీరు నిలిచిపోకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. చిన్నారులకు...