కళాకారులకు ఉద్యోగాలివ్వాలి మినీ పోస్టు 96 అమలు చేయాలి.. ఉద్యమ కళాకారుల డిమాండ్*ఉద్యోగాలు ఇవ్వకుంటే ప్రభుత్వంపై ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక*
*నల్గొండ* : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాట, ఆటలతో ప్రజలను చైతన్యపరిచిన కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని నల్గొండ జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం డిమాండ్ చేసింది. కళాకారుల కోసం ప్రతిపాదించిన మినీ పోస్టు 96 అంశాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరింది. ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని సంఘం జిల్లా అధ్యక్షుడు పందిరి సైదులు ఆరోపించారు.ఆదివారం నల్గొండలో సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కళాకారుల ఉద్యోగాల అంశాన్ని గతంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్, పాల్వాయి మహేశ్ ప్రస్తావించారని తెలిపారు. ఇటీవల శాసనమండలిలో విజయశాంతి సైతం ఈ అంశాన్ని ప్రస్తావించి ఏడాది గడిచినా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని...