రాంకీ విల్లాలో భక్తిశ్రద్ధలతో మట్టి వినాయకుని పూజ

పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా మట్టి వినాయకుని ప్రతిష్ఠ — రాంకీ కుటుంబ సభ్యుల సామూహిక పూజలు వరంగల్: రాంకీ విల్లా ఓనర్స్ ఆధ్వర్యంలో సోమవారం రాంకీ విల్లాస్‌లో మట్టి వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ద్వారా పర్యావరణ హితమైన వినాయక చవితి వేడుకలకు శ్రీకారం చుట్టారు. బ్రాహ్మణోత్తములు గోపి, అరుణ్ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణలతో గణపతి పూజ, ప్రత్యేక అభిషేకాలు మరియు ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాంకీ విల్లా ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి అశోక్ బాబు మాట్లాడుతూ, మట్టి వినాయక విగ్రహాలను...