కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదుకార్యకర్తలే మా బలంవచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ నుంచే పోటీ

తెలంగాణ వరంగల్ సెప్టెంబర్ 13 వరంగల్‌: కాంగ్రెస్‌ పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి,వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ,మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్పష్టం చేశారు.ఆదివారం వరంగల్‌లోని ఎంకే నాయుడు హోటల్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు.పదవులు వస్తుంటాయి..పోతుంటాయని,తమకు పార్టీపై,కార్యకర్తలపై కృతజ్ఞత ఎప్పటికీ ఉంటుందని కొండా మురళి అన్నారు.రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో 24 మంది కార్పొరేటర్లను గెలిపించుకుంటామని,కష్టపడి పనిచేసే వారికి టికెట్లు దక్కేలా చూస్తామని చెప్పారు.అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగుతామని,కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు.కాంగ్రెస్‌ పార్టీ తనకు ఇచ్చిన మంత్రి పదవికి ఎలాంటి మచ్చ తీసుకురాలేదని కొండా సురేఖ అన్నారు.పదవి...