ఇండియన్ అమెరికన్ ఫోరం జూమ్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తీవ్ర విమర్శలు
వరంగల్, సెప్టెంబర్ 14 ఇండియన్ అమెరికన్స్ ఫోరం (ఐఏఎఫ్) ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌తో అమెరికా నుంచి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఐఏఎఫ్ గ్లోబల్ అధ్యక్షుడు డాక్టర్ జమీల్ అధ్యక్షత వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు సమావేశంలో దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. గత రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంతో పోలిస్తే వరంగల్‌లో మౌలిక వసతులు, విద్య, సంక్షేమ కార్యక్రమాల విషయంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన హామీలు కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని పేర్కొన్నారు. అభివృద్ధి...