ఆమిర్ అలీ ఖాన్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ‘సియాసత్’ కీలక పాత్ర రజా అహ్సాన్
*తెలంగాణ/వరంగల్,సెప్టెంబర్ 15* జనగామ: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ‘సియాసత్’ దినపత్రిక,దాని న్యూస్ ఎడిటర్ ఆమిర్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించారని మెకానికల్ ఇంజనీర్,యూత్ కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ రజా అహ్సాన్ అన్నారు.2023 ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని వివిధ జిల్లాలు,మండలాల్లో పర్యటించి సభలు,కార్నర్ మీటింగ్‌లు నిర్వహిస్తూ ముస్లింలను కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవాలని ఆమిర్ అలీ ఖాన్ పిలుపునిచ్చారని తెలిపారు.‘సియాసత్’ద్వారా ముస్లింల సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువచ్చి రాజకీయ చైతన్యం కల్పించారని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమిర్ అలీ ఖాన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయడంతో ముస్లింలలో ఆనందం నెలకొందని రజా అహ్సాన్ అన్నారు.అయితే సుమారు ఏడాదిన్నర తర్వాత ఆయన స్థానంలో...