సెప్టెంబర్ 17వ తారీఖున కిలా వరంగల్ మండల రెవెన్యూ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం
తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు రేవంత్ యూరెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నందుకు తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17వ తారీఖున కిలా వరంగల్ మండల రెవెన్యూ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపడుతున్నామని ఉద్యమకారులు అందరు ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని వరంగల్ ఉమ్మడి జిల్లాల ఉద్యమకారుల సంఘం కన్వీనర్ మరుపల్ల రవి కోరినారు ఉర్సు ప్రతాప్ నగర్ లో జరిగిన వరంగల్ ఉమ్మడి జిల్లాల ఉద్యమకారు ల సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడినారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి తెలంగాణ రాష్ట్ర సాధకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపుమేరకు అనేక ఉద్యమాలు నిర్వహించి అరెస్టులై కేసులపాలై కోర్టుల చుట్టూ తిరుగుతూ...