అర్హులైన వారందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు... నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల స్థానంలో ప్రతిష్టాత్మకంగా స్మార్ట్ కార్డులను తీసుకువచ్చిందని నగర మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ పచ్చల సోమేశ్వరాలయం వద్ద ఏర్పాటు చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన వారందరికీ రేషన్ కార్డును పంపిణీ చేసిందని పేర్కొన్నారు. రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులుగా డిజిటలైజేషన్ చేసి పంపిణీ చేస్తుందని తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 48 డివిజన్లో మొత్తం 62,853 స్మార్ట్ రేషన్ కార్డులు మంజూరు...