అక్రమ అరెస్టులకు బయపడేదే లేదు.. ప్రజల పక్షాన పోరాటం ఆపేది లేదు..
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సంగెం మండల బీఆర్ఎస్ యూత్ నాయకులు పెండ్లి పురుషోత్తం రెడ్డి, బొమ్మాల శంకర్,పోశాల ప్రవీణ్,జున్న రాజు,చిర్ర రాజు లను తెల్లవారుజామునే 4గంటలకే అక్రమంగా వారి ఇండ్ల నుండి తీసుకువచ్చి సంగెం పోలీస్ స్టేషన్లో ముందస్తుగా అరెస్ట్ చేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి మేం అధికారంలోకి వచ్చిన 100రోజుల్లోనే ఆరు గ్యారంటీలు,420 హామీలు చేస్తామని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసి సీఎం కుర్చీ ఎక్కి 1000రోజులైనా ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డిని గద్దె దింపే వరకు...