మహిళల భద్రతే మా ప్రధాన లక్ష్యం విద్యార్థినులకు షీ టీమ్‌పై అవగాహన కల్పించిన అదనపు డీసీపీ బాలస్వామి
తెలంగాణ/వరంగల్,సెప్టెంబర్ 16 కాజీపేట: మహిళల భద్రతకు ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా వ్యవహరించాలని వరంగల్ అదనపు డీసీపీ(క్రైమ్స్)బాలస్వామి సూచించారు.కాజీపేటలోని తాళ్ల పద్మావతి ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థినులు,విద్యార్థులకు షీ టీమ్,సైబర్ నేరాలు, మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ అప్రమత్తంగా ఉండటం ద్వారా మహిళలపై జరిగే నేరాలను చాలా వరకు అరికట్టవచ్చన్నారు.సైబర్ నేరాలు,మహిళలపై జరిగే అఘాయిత్యాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు.క్రైమ్ ఏసీపీ సదయ్య మాట్లాడుతూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,స్నాప్‌చాట్,టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత ఫొటోలు,వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు.మహిళలు ఒంటరిగా తెలియని ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో టీ-సేఫ్ యాప్‌ను వినియోగించుకోవాలని తెలిపారు.ఉద్యోగినులు పనిచేసే ప్రాంతాల్లో ఆకతాయిలు,అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తుల...