డీసీసీ భవన్‌లో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
హనుమకొండ: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో గురువారం సంబరాలు ఘనంగా నిర్వహించారు. హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, టిపిసిసి మహిళా అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ రాజేశ్వర్ రావు, లైబ్రరీ ఛైర్మన్ అజీజ్ ఖాన్, టిపిసిసి అఫిషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీమతి కూచన రవళి మరియు జిల్లా కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. *ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి...