పేదల వైద్య చికిత్సకు ప్రభుత్వం అండగా: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వైద్య ఖర్చులు భరించలేని నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని 2వ డివిజన్ గుండ్లసింగారం గ్రామానికి చెందిన చల్లూరి రాజేందర్ వైద్య చికిత్స కోసం రూ.5 లక్షల విలువైన ఎల్‌ఓసీ చెక్కును ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సుబేదారిలోని క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ వైద్యానికి దూరం కాకూడనే ఉద్దేశంతో అర్హులైన వారికి ఎల్‌ఓసీల ద్వారా సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం...