రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన భూ ఆరోపణలు పూర్తిగా అసత్యమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. తాను భూ కబ్జాలకు పాల్పడినట్లు ఆధారాలు చూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. తమ వారసత్వ భూములను విక్రయించి రాజకీయాలు చేశానని, భూ కబ్జాలకు పాల్పడలేదని అన్నారు. భూ వ్యవహారాలపై ధైర్యం ఉంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధికారులను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడితే ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు. భూ వ్యవహారాలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని, అప్పుడు అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేటీఆర్, హరీశ్ రావు, ఇతర బీఆర్ఎస్...