వక్ఫ్‌ భూముల సర్వేకు అడ్డంకులు అధికారులు,దర్గా కమిటీ సభ్యులతో భూకబ్జాదారుల వాగ్వాదం..దాడికి యత్నం

*తెలంగాణ,వరంగల్,సెప్టెంబర్ 17* వరంగల్‌లోని బిక్కన్‌ దర్వేష్‌ రహ్మతుల్లా అలై దర్గా భూములకు సంబంధించి నిర్వహిస్తున్న సర్వేను కొందరు అడ్డుకున్నారని దర్గా కమిటీ సభ్యులు ఆరోపించారు.సర్వే నంబర్లు 273,274,275,276లోని సుమారు 15 ఎకరాల 5 గుంటల భూమి దర్గా వక్ఫ్‌ భూమిగా ఉన్నట్లు రికార్డుల ఆధారంగా స్పష్టమవుతోందని వారు తెలిపారు.సర్వే నిర్వహించేందుకు వచ్చిన అధికారులు,దర్గా కమిటీ సభ్యులతో కొందరు వాగ్వాదానికి దిగడమే కాకుండా దాడికి ప్రయత్నించారని ఆరోపించారు.వక్ఫ్‌ భూమిని ఆక్రమణల నుంచి రక్షించాలని గతంలోనే కలెక్టర్‌,రెవెన్యూ,పోలీస్‌ అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేశామని కమిటీ సభ్యులు తెలిపారు.అయితే సర్వే ప్రక్రియను కొందరు అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.ఈ క్రమంలో దర్గా కమిటీ సభ్యుడు మహమ్మద్‌ అలీపై దాడికి ప్రయత్నించగా,అక్కడ మీడియా ప్రతినిధులు...