విశ్వకర్మ వీధిలో అంగరంగ వైభవంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం

వరంగల్: విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని వరంగల్ విశ్వకర్మ వీధిలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక పూజలు, యజ్ఞ కార్యక్రమాలను నిర్వహించారు. విశ్వకర్మ సమాజానికి చెందిన భక్తులు, మహిళలు, యువతతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యజ్ఞ మహోత్సవంలో భాగంగా దంపతులు యజ్ఞ వేదికపై కూర్చొని వేద పండితుల ఆధ్వర్యంలో హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేక పూజలు, హోమాలతో విశ్వకర్మ భగవానుడిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. లోక కళ్యాణం, ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సమృద్ధి కలగాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. యజ్ఞ వేదిక వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని...