ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేయాలిగుడిమల్ల రవికుమార్..తెలంగాణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఓదార్పు యాత్ర ప్రారంభం
*తెలంగాణ/వరంగల్,సెప్టెంబర్ 17* తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి వారికి న్యాయం చేయాలని తెలంగాణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గుడిమల్ల రవికుమార్ డిమాండ్ చేశారు.ఉద్యమ సమయంలో లాఠీచార్జీలు,అవమానాలు,ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ స్వరాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులకు ప్రత్యేక గుర్తింపు,సంక్షేమ పథకాలు,తగిన ప్రాధాన్యం కల్పించాలని కోరారు.ఇందులో భాగంగా గుడిమల్ల రవికుమార్ ఆధ్వర్యంలో గురువారం వరంగల్ చౌరస్తా నుంచి తెలంగాణ ఉద్యమకారుల ఓదార్పు యాత్ర తొలి దశను ప్రారంభించారు.నాలుగు రోజులపాటు కొనసాగనున్న యాత్రలో ఉద్యమకారుల ఇళ్లకు వెళ్లి వారి పరిస్థితులను తెలుసుకుని,వారికి జరిగిన అన్యాయాలను గుర్తించే కార్యక్రమం చేపట్టారు.వరంగల్ చౌరస్తా నుంచి పోస్టాఫీస్ అండర్‌బ్రిడ్జి,చాకరాసుకుంట,కిలా వరంగల్ తూర్పు కోట,శివనగర్ మీదుగా చింతల్ వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ...