స్వయం ఉపాధికి చేయూత.. వృద్ధులకు భరోసా
వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి కందుకూరి పూజ కాశీబుగ్గ లోని స్వశక్తి సధన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఆశ్రయం పొందుతున్న వారితో మాట్లాడి, వారి సమస్యలు, అవసరాలు, అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. వారి సంక్షేమానికి సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకుని, అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన "టైలరింగ్ శిక్షణ" పూర్తి చేసిన వారికి టైలరింగ్ శిక్షణ ధ్రువపత్రాలను అందజేశారు. శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాలను ఉపయోగించుకుని స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. స్వశక్తి భవన్ ఇన్‌చార్జి వనం.బాలరాజు కార్యక్రమానికి సంబంధించిన వివరాలను న్యాయమూర్తికి వివరించారు....