EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విద్యాభివృద్ధికి దివీస్ సహకారం

    Author
    Posted By JANA CHARITRA
    | 19 Sep 2026, 04:49 PM | TELANGANA, యాదాద్రి భువనగిరి
    విద్యాభివృద్ధికి దివీస్  సహకారం

    గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి దివిస్ లేబరేటరీస్ అందిస్తున్న సహాయం అభినందనీయమని సంస్థాన్ నారాయణపురం మండలం వాయిల్లపల్లి సర్పంచి అయితరాజు సరళ తెలిపారు.ఆ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో దివీస్ లేబరేటరీస్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచి సరళ మాట్లాడుతూ దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకుని విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు,విద్యార్థులు కృషి చేయాలని కోరారు.ఉత్తమ విద్యతోనే విద్యార్థుల జీవితం బాగుపడుతుందని తెలిపారు.డాక్టర్ జయంత్ కుమార్,డాక్టర్ నరేష్ ల ఆధ్వర్యంలో 144 మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా ఔషధాలు బలవర్ధక టానికులు సర్పంచి చేతులమీదుగా పంపిణీ చేశారు.విద్యార్థులకు రూ ఒక లక్ష 16 వేల 334 విలువైన 3033 నోట్ బుక్స్ ను విద్యార్థులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు అశోక్ రెడ్డి,దివిస్ ప్రతినిధి వెంకటేశ్వర్లు,ఉపాధ్యాయులు,తదితరులు,పాల్గొన్నారు.