EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో కాళోజీ కోచింగ్ & ట్యూషన్ విద్యార్థులకు ప్రతిభా పరీక్ష.

    Author
    Posted By AKULA MADHU
    | 19 Sep 2026, 08:06 PM |
    భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో  కాళోజీ కోచింగ్ & ట్యూషన్ విద్యార్థులకు ప్రతిభా పరీక్ష.

    భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో కాళోజీ కోచింగ్ & ట్యూషన్ విద్యార్థులకు శనివారం ప్రతిభా పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ ప్రతిభా పరీక్ష 9, 10 వ తరగతి విద్యార్థుల స్థాయిలో, మరియు 7,8 వ తరగతుల విద్యార్థుల స్థాయిలో వేరువేరుగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాళోజీ ఫౌండేషన్ ఫౌండర్ & చైర్మన్ ఆకుల మధు మాట్లాడుతూ ఇలాంటి పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులలో స్వయం అంచనా, నైపుణ్యాల గుర్తింపు, తార్కిక ఆలోచన, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, పోటీ తత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని అన్నారు. అలాగే ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అందజేయడం జరుగుతుందన్నారు.