EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మద్యం మత్తులో వాహన డ్రైవర్!

    Author
    Posted By AKULA MADHU
    | 22 Sep 2026, 01:16 PM |
    మద్యం మత్తులో వాహన డ్రైవర్!

    చౌటుప్పల్: హైదరాబాదు నుండి జాతీయ రహదారి గుండా విజయవాడ వైపు వెళుతున్న హర్యానాకు చెందిన లారీ డ్రైవర్ మద్యం మత్తులో స్థానికులను భయాందోళనలకు గురి చేసేలా వాహనాన్ని నడిపాడు... అజాగ్రత్తగా, అడ్డదిడ్డంగా వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ ను గమనించిన వాహనదారుడు లారీని వెంబడించి, డ్రైవర్ ని పట్టుకొని నిలదీయడం జరిగింది.. డ్రైవర్ పూర్తిగా మద్యం మత్తులో ఉండి ఎంతకు వినకపోవడంతో పోలీసులకు సమాచారం అందించి వాహనాన్ని పక్కకు తీయించి , లారీ కింద ఇరుక్కున్న డ్రమ్ములను బయటకు తీయడం జరిగింది. వెంటనే అతడిని పోలీసులకు అప్పగించడం జరిగింది.. ఫ్లై ఓవర్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో హెచ్చరికగా పెట్టినటువంటి ఇసుక బస్తాలను,డ్రమ్ములను పూర్తిగా ధ్వంసం చేస్తూ వెళ్లడం జరిగింది. ఇది గమనించిన కార్మికులు, స్థానికులు వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఇలా మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. మద్యం సేవించి వాహనం నడపడం ఎంతో ప్రమాదకరమని హెచ్చరిస్తున్నా కొంతమంది డ్రైవర్ల తీరు మారడం లేదు.