EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చౌటుపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లి. నూతన చైర్మన్ మరియు డైరెక్టర్ల ఎన్నిక

    Author
    Posted By JANA CHARITRA
    | 23 Sep 2026, 06:50 PM | TELANGANA, వరంగల్
    చౌటుపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లి. నూతన చైర్మన్ మరియు డైరెక్టర్ల ఎన్నిక

    జన చరిత్ర న్యూస్
    *పర్వతగిరి మండలం చౌటపల్లి ప్రాథమిక వ్యవసాయసహకార సంఘం లి. నూతన చైర్మన్ గా వడ్లకొండ గ్రామానికి చెందిన అత్తి కుమారస్వామి గారు ఎన్నికై బాధ్యతలు స్వీకరించారు. అలాగే డైరెక్టర్లుగా చింత నెక్కొండ గ్రామానికి చెందిన పల్లెపాటి రామచందర్రావు,ఓరుగంటి శ్రీనివాస్ గార్లు ఎన్నికై బాధ్యతలు స్వీకరించారు.*
    సొసైటీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని మర్యాదపూర్వకంగా కలిసిన చింత నెక్కొండ గ్రామ సర్పంచ్ గాడుదుల రమేష్ యాదవ్ గారు,AB తండా సర్పంచ్ గుగులోత్ కిషన్ నాయక్ గారు, వార్డు మెంబర్ లాకర్ రమేష్,సీనియర్ నాయకులు గురువరావు,దబ్బెట నర్సయ్య,దేవేందర్రావు, జూలపల్లి వెంకన్న,గాడిపెళ్లి వెంకన్న,దబ్బెట కరుణాకర్,భాషపాక కరుణాకర్,సొసైటీ సభ్యులు,గ్రామ ప్రముఖులు పాల్గొని షాలువాళతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.