EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మిస్సింగ్ మొబైల్ రికవరీ – బాధితుడికి అందజేసిన రాయపర్తి ఎస్సై ముత్యం రాజేందర్

    Author
    Posted By JANA CHARITRA
    | 24 Sep 2026, 04:38 PM | TELANGANA, వరంగల్
    సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మిస్సింగ్ మొబైల్ రికవరీ – బాధితుడికి అందజేసిన రాయపర్తి ఎస్సై ముత్యం రాజేందర్

    రాయపర్తి, సెప్టెంబర్ 23:

    పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను సీఈఐఆర్ (CEIR) పోర్టల్ సహాయంతో గుర్తించి, బాధితుడికి అందజేసిన ఘటన రాయపర్తిలో చోటుచేసుకుంది. రాయపర్తి పోలీస్ స్టేషన్ ఎస్సై ముత్యం రాజేందర్ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మిస్సింగ్ ఫోన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

    అనంతరం ఆ మొబైల్ ఫోన్‌ను బాధితుడు బానోతు తార్యకు ఎస్సై ముత్యం రాజేందర్ అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడు పోలీసుల సేవలను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

    ఇవి కూడా చదవండి

    ప్రజలు తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, సీఈఐఆర్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని పోలీసులు సూచించారు.