EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వర్షాలు, ఈదురుగాలులకు నేలకొరిగిన చెట్లు తొలగించిన జనగామ పోలీసులు

    Author
    Posted By JANA CHARITRA
    | 24 Sep 2026, 04:47 PM | TELANGANA, వరంగల్
    వర్షాలు, ఈదురుగాలులకు నేలకొరిగిన చెట్లు తొలగించిన జనగామ పోలీసులు

    జనగామ, సెప్టెంబర్ 23: భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా జనగామ గ్రెయిన్ మార్కెట్‌ నుంచి చిటకోడూరు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై పలు చెట్లు విరిగిపడి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

    సమాచారం అందుకున్న వెంటనే జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్‌ఐ చెన్నకేశవులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు సిబ్బంది నరేష్, ప్రణయ్‌లతో కలిసి రోడ్డుపై పడిన చెట్లను తొలగించే చర్యలు చేపట్టారు. సుమారు పది నిమిషాల్లోనే చెట్లను తొలగించి వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు.

    పోలీసుల సత్వర స్పందనతో రహదారిపై ఏర్పడిన అంతరాయం తొలగిపోయి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సాధారణ రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి.

    ఇవి కూడా చదవండి