EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 12వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలను ప్రారంభించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

    Author
    Posted By JANA CHARITRA
    | 26 Sep 2026, 01:45 PM | TELANGANA, వరంగల్
    12వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలను ప్రారంభించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

    హనుమకొండ, సెప్టెంబర్ 26:
    హనుమకొండలోని జేఎన్‌ఎస్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న 12వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

    ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత మాట్లాడుతూ, జేఎన్‌ఎస్‌ స్టేడియం క్రీడాకారులకు ఒక వరం వంటిదని పేర్కొన్నారు. స్టేడియంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను మరింతగా మెరుగుపరుచుకోవాలని సూచించారు.

    క్రీడల్లో విజయం సాధించడం కంటే పోటీల్లో పాల్గొనడమే గొప్ప విజయమని ఆమె అన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొంటూ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.

    ఇవి కూడా చదవండి