EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అంబేద్కర్ ఆశయాలు సమాజం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం

    Author
    Posted By JANA CHARITRA
    | 26 Sep 2026, 05:30 PM | TELANGANA, నల్గొండ
    అంబేద్కర్ ఆశయాలు సమాజం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం

    ప్రపంచ రాజ్యాంగాలలో కెల్లా భారత రాజ్యాంగం అత్యంత విలువైనదని భారత దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు అట్టి రాజ్యాంగానికి లోబడి గౌరవించి నడుచుకోవాలని ఉంటుందని ,కుల మత ప్రాంతాలకతీతంగా అందర్నీ సమదృష్టిలో చూసే రాజ్యాంగం నేడు ప్రమాదంలో పడిందని, అసమానతులకు నిలయమైన మనుధర్మాన్ని ప్రవేశపెట్టినందుకు మతతత్వ శక్తులు ప్రయత్నిస్తున్నాయని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఈరోజు స్థానిక అంబేద్కర్ భవన్లో జరిగిన అంబేద్కర్ ఆశయాలు సమాజం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వివిధ కుల సంఘాల నేతలు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని వారి అభిప్రాయాన్ని వెలిబుచ్చారు . వంటెపాక యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చింత ముత్యాలరావు, కత్తుల జగన్ కుమార్, ఎండి నజీరుద్దీన్, శంకర్ గౌడ్, దుడుకు లక్ష్మీనారాయణ, కొండ లలిత, నేలపట్ల సత్యనారాయణ,ఎండి రఫీ, పెరికి అంజయ్య, అనుముల సురేష్, కట్టెల శివ తదితరులు పాల్గొన్నారు