EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • శ్రీ వెంకటేశ్వర బదిరుల పాఠశాలలో ప్రపంచ బదిరుల దినోత్సవం

    Author
    Posted By JANA CHARITRA
    | 27 Sep 2026, 08:48 PM | TELANGANA, వరంగల్
    శ్రీ వెంకటేశ్వర బదిరుల పాఠశాలలో ప్రపంచ బదిరుల దినోత్సవం

    *ముఖ్య అతిథిగా పాల్గొన్న వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలా గీతాంబ మరియు డి ఎం ఎచ్ ఓ డా. బి.రాజా రెడ్డి*

    ప్రపంచ బదిరుల దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి.పూజ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర బదిరుల పాఠశాల, హనుమకొండ లోని వినికిడి లోపం గల విద్యార్థులకు , వరంగల్, హనుమకొండ జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్ బి రాజా రెడ్డి, డా.అప్పయ్య మరియు మెడికవర్ హాస్పిటల్, హంటర్ రోడ్, వరంగల్ వారి సహకారంతో ఉచిత వైద్య, ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలా గీతాంబ పాల్గొన్నారు.

    ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి కందుకూరి పూజ గారు, వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి బి. రాజారెడ్డి, వరంగల్ జిల్లా సంక్షేమ శాఖ అధికారి బి.రాజమణి, లీగల్ ఎయిడ్ కౌన్సెల్ పి.శ్రీనివాసరావు, పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీ, డా.అనిత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి

    శిబిరంలోని డాక్టర్లు విద్యార్థులకు అవసరమైన వైద్య పరీక్షలు, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన మరియు సంబంధిత వైద్య సలహాలు అందించారు. వినికిడి లోపం గల విద్యార్థులకు సమాన ఆరోగ్య సేవలు, విద్యా అవకాశాలు, న్యాయ సహాయం మరియు వారి హక్కులపై అవగాహన కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.
    ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అందించే దివ్యాంగజన్ కౌశల్ వికాస్ ద్వారా దివ్యాంగులకు నైపుణ్య శిక్షణ, దివ్యాంగజన్ రోజ్‌గార్ సేతు ద్వారా ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోంది అని వాటి గురించి వివరించారు. ఈ రెండు కార్యక్రమాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకుని నైపుణ్యాలను పెంపొందించుకుని స్వయం ఆధారిత జీవనం వైపు ముందుకు సాగాలి అని పిలుపునిచ్చారు.

    ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ "వినికిడి లోపం గల వ్యక్తులతో సమర్థవంతమైన సంభాషణకు సంకేత భాష (ప్రత్యేక భాష) కీలకమైన సాధనమని, అయితే సాధారణ ప్రజల్లో సంకేత భాషపై అవగాహన కల్పించుట కొరకు పాఠశాలలు, కళాశాలల్లో ప్రాథమిక సంకేత భాష బోధనకు జిల్లా విద్యా శాఖాధికారి సహకారంతో చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
    వినికిడి లోపం గల వ్యక్తులతో సాధారణ విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సమాజంలోని ఇతర వర్గాలు సులభంగా సంభాషించగలిగేలా ప్రాథమిక సంకేత భాషపై అవగాహన కల్పించడం ద్వారా సమగ్ర సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

    వినికిడి లోపం ఒక అడ్డంకి కాకుండా, ప్రతి వ్యక్తికి సమాన అవకాశాలు మరియు గౌరవంతో జీవించే హక్కు ఉందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
    ఈ వైద్య శిబిరంలో వరంగల్‌, హనుమకొండ జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డా.బి.రాజా రెడ్డి, డా.అప్పయ్య మరియు మెడికవర్ హాస్పిటల్, హంటర్ రోడ్ వారి సహకారంతో ఈ.ఎన్.టి., ఆడియోమెట్రి, కంటి సంబంధ, మధుమేహ, జనరల్ ఫిజిషియన్, దంత, రక్త సంబంధ పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి వైద్యుల సూచనల మేరకు సంబంధిత మందులు అందించడం జరిగింది.

    — జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, వరంగల్ మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, వరంగల్