EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చౌటుప్పల్ : ప్లాస్టిక్ వ్యర్థాలతో కుప్పలు కుప్పలుగా చెత్తాచెదారం! పట్టించుకునే వారేరీ?

    Author
    Posted By AKULA MADHU
    | 29 Sep 2026, 09:15 AM |
    చౌటుప్పల్ : ప్లాస్టిక్ వ్యర్థాలతో కుప్పలు కుప్పలుగా చెత్తాచెదారం! పట్టించుకునే వారేరీ?

    ఒకసారి పై చిత్రాన్ని చూడండి! ప్లాస్టిక్ వ్యర్ధాలు, ఆహారపు వ్యర్ధాలు, చెత్తాచెదారంతో , ఇలా వీటన్నిటితో నిండి కుప్పలు,కుప్పలుగా, చెత్తాచెదారం దుర్వాసనతో దర్శనమిస్తుంది. మరి ఇంతకీ ఇది ఎక్కడ? చౌటుప్పల్ పట్టణంలో ఒకవైపు నాగులకుంట, మరొకవైపు షాదీఖానా, పక్కకు చూస్తే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇలా వీటన్నిటి దగ్గర ఇలాంటి అపరిశుభ్ర వాతావరణం. నిత్యం ఎంతోమంది పాదచారులు, ద్విచక్ర వాహనదారులు, కళాశాల విద్యార్థులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు.
    మరి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించి చెత్తాచెదారాన్ని తక్షణమే తొలగించేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా ఇలా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని, అలాగే స్వచ్ఛతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు.