EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బచ్చన్నపేట పోలీస్ స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్

    Author
    Posted By JANA CHARITRA
    | 30 Oct 2026, 06:39 PM | TELANGANA, వరంగల్
    బచ్చన్నపేట పోలీస్ స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్

    ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలి – పోలీస్ సిబ్బందికి సూచనలు

    బచ్చన్నపేట: వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఐపీఎస్ బచ్చన్నపేట పోలీస్ స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని నేర రికార్డులు, కేసుల దస్త్రాలు, స్టేషన్ నిర్వహణకు సంబంధించిన రికార్డులు, ఇతర ముఖ్యమైన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, సిబ్బంది విధుల నిర్వహణ, స్టేషన్ నిర్వహణ తీరుపై సమీక్ష నిర్వహించారు.

    అనంతరం పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీస్ సేవలు అందించాలని, ఫిర్యాదుదారులు, ప్రజలతో మర్యాదపూర్వకంగా, గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ వృత్తిపరమైన నిబద్ధతతో పనిచేయాలని ఆదేశించారు.

    ఇవి కూడా చదవండి

    అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో డీసీపీ రాజమహేంద్ర నాయక్ మొక్కను నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు.

    ఈ కార్యక్రమంలో నర్మెట్ట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పెండ్యాల దేవేందర్‌తో పాటు బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.