EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • డ్రైనేజీ గుంతకు మూత! స్థానికుల హర్షం

    Author
    Posted By AKULA MADHU
    | 04 Nov 2026, 10:43 AM |
    డ్రైనేజీ గుంతకు మూత! స్థానికుల హర్షం

    చౌటుప్పల్‌లో వార్తకు స్పందన.. డ్రైనేజీ గుంతకు మూత!
    జనచరిత్ర వార్తతో కదిలిన అధికారులు.. ప్రజలకు ఊరట!
    చౌటుప్పల్ పట్టణంలోని స్థానిక నాలాలో ప్రమాదకరంగా తెరిచి ఉన్న డ్రైనేజీ గుంతపై అక్టోబర్ 6, 2026న జనచరిత్రలో ప్రచురితమైన వార్తకు స్పందన లభించింది. ప్రజలకు ప్రమాదకరంగా మారిన ఈ గుంత సమస్యను అధికారులు పరిష్కరించారు.
    గతంలో ఎలాంటి రక్షణ లేకుండా తెరిచి ఉన్న ఈ డ్రైనేజీ గుంతలోకి ఎవరైనా ప్రమాదవశాత్తు పడిపోయే అవకాశం ఉందని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులకు ప్రమాదం పొంచి ఉందని వార్తలో ప్రస్తావించడం జరిగింది.
    తాజాగా అధికారులు స్పందించి డ్రైనేజీ గుంతకు మూత బిగించడంతో సమస్యకు పరిష్కారం లభించింది. ఈ కార్యక్రమంలో అధికారుల ఆదేశాలతో వేణు సునీల్ రాజు హైవే సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి సమస్యను పరిష్కరించడం జరిగింది.