EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • *అనుమతులు గోరంత,ఏర్పాట్లు కొండంత*

    Author
    Posted By Gade Krishna
    | 04 Nov 2026, 08:31 PM | TELANGANA
    *అనుమతులు గోరంత,ఏర్పాట్లు కొండంత*

    *గమనించని మున్సిపల్ అధికారులు*

    *ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో అని భయపడుతున్న ప్రజలు*


    జన చరిత్ర,(మహబూబాబాద్ జిల్లా) బ్యూరో
    తొర్రూరు, నవంబర్ 04

    ఇవి కూడా చదవండి


    మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొందరు దీపావళి పండుగ సందర్భంగా ముందుగానే దీపావళి పటాకులు విక్రయించడానికి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.అధికారుల అనుమతులు తీసుకోకుండా ముందస్తుగా పటాకుల విక్కయ కేంద్రాలను ఏర్పాట్లు చేసుకోవడం పై సామాన్య ప్రజలు సందిగ్ధంలో ఉన్నారు.ప్రభుత్వ అనుమతులు గోరంత ఏర్పాట్లు కొండంత జరుగుతుండడంతో ప్రజల్లో కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పటాకుల అనుమతుల్లో ఎలాంటి జాగ్రత్తలు ఏలాంటి చర్యలు పాటించాలో అధికారుల సూచనలు పాటించకుండా, పటాకుల విక్రయ కేంద్రాలను ఏర్పాట్లు చేసుకోవడం పై ప్రజల్లో పలు అనుమానాలు వెలువడుతున్నాయి. దీపావళి పటాకుల విక్రయ కేంద్రాల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్న మున్సిపల్ అధికారులు మాత్రం ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరు ప్రజల ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందో తెలుస్తుంది. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు దీపావళి పటాకుల కేంద్రాల ఏర్పాట్లలో ప్రభుత్వ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.