EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ముఖ్యమంత్రి రాకకు ముస్తాబైన ములుగు నూతన కలెక్టరేట్

    Author
    Posted By JANA CHARITRA
    | 16 Aug 2026, 11:51 AM | TELANGANA, తెలంగాణ, వరంగల్
    ముఖ్యమంత్రి రాకకు ముస్తాబైన ములుగు నూతన కలెక్టరేట్

    ములుగు జిల్లా: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ములుగు జిల్లా నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సర్వహంగులతో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా నూతన కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభం కానుంది.
    ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. బంతిపూల తోరణాలు, సప్తవర్ణ రంగులు, వివిధ రకాల పూలతో కలెక్టరేట్ ప్రాంగణాన్ని ఆకట్టుకునేలా అలంకరించారు. సభా ప్రాంగణంలో అతిథులు, ప్రజల కోసం కుర్చీలు, ఆధునిక సౌండ్ సిస్టమ్‌తో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
    తెలంగాణ తల్లి విగ్రహం పరిసరాల్లో ప్రత్యేక సుందరీకరణ పనులు చేపట్టారు. కలెక్టరేట్ ప్రాంగణంలో బారికేడింగ్, పార్కింగ్, తాగునీరు తదితర మౌలిక వసతులను సిద్ధం చేశారు. అతిథుల స్వాగతం నుంచి ప్రారంభోత్సవ కార్యక్రమం వరకు పక్కా ఏర్పాట్లు చేశారు.
    ముఖ్యమంత్రి రాక సందర్భంగా నూతన కలెక్టరేట్ వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. ములుగు జిల్లా పరిపాలనకు కొత్త చిరునామాగా నిలవనున్న నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.