EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మట్టి వినాయకులను ప్రతిష్టిద్దాం - పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.. మాజీ కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్.

    Author
    Posted By JANA CHARITRA
    | 14 Sep 2026, 04:42 PM | TELANGANA, వరంగల్
    మట్టి వినాయకులను ప్రతిష్టిద్దాం - పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.. మాజీ కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్.

    ఖిల్లా వరంగల్ : మట్టి వినాయకుడిని ప్రతిష్టిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అని 37వ డివిజన్ మాజీ కార్పొరేటర్ భోగి సువర్ణ సురేష్ అన్నారు.
    ఈ సందర్భంగా వినాయక చవితిని పురస్కరించుకొని మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చిన మట్టి విగ్రహ లను ప్రజలకు అందించడం జరిగింది.
    ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాజీ కార్పొరేటర్ భోగి సువర్ణ సురేష్ మాట్లాడుతూ ప్రజలందరూ మట్టి వినాయకులను ప్రతిష్టించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు అలాగే ఆ వినాయకుని యొక్క దీవెనలు ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఆ దేవుని వేడుకున్నారు.
    ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు బొలుగొడ్డు శ్రీనివాస్ ఎసి రెడ్డి రమేష్ వనపర్తి కరుణాకర్, సాంబమూర్తి, తోట ప్రభాకర్ మేకల రాజేందర్ రాజబోయిన ఉప్పలయ్య లతోపాటు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.