EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దుగ్గొండి పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ వైద్య సేవలు మెరుగుపర్చాలి..పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి

    Author
    Posted By JANA CHARITRA
    | 16 Sep 2026, 08:37 PM | TELANGANA, వరంగల్
    దుగ్గొండి పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ  వైద్య సేవలు మెరుగుపర్చాలి..పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి

    తెలంగాణ/వరంగల్/దుగ్గొండి,సెప్టెంబర్ 16
    దుగ్గొండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.పీహెచ్‌సీలోని రికార్డులు,ల్యాబొరేటరీ,ఫార్మసీ,వార్డు,ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు.చికిత్స కోసం వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సేవలు,సిబ్బంది పనితీరుపై వివరాలు తెలుసుకున్నారు.ఆస్పత్రి లోపల,బయట ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతోపాటు అన్ని సేవా సూచికల్లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా పనితీరును మెరుగుపర్చాలని ఆదేశించారు.ఫార్మసీలోని అన్ని మందులకు స్పష్టమైన లేబులింగ్ చేసి,క్రమపద్ధతిలో అమర్చాలని,ఈ-ఔషధి పోర్టల్ ద్వారా మందుల నిల్వలు,పంపిణీని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.టీకాలను బ్యాచ్‌ల వారీగా నిర్వహించి, బ్యాచ్ నంబర్లను పక్కాగా నమోదు చేయాలన్నారు.బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో కలర్‌ కోడెడ్‌ బిన్స్‌ వినియోగించాలని,అవి అందుబాటులో లేని సందర్భంలో రెడ్‌,బ్లాక్‌ కవర్లను ఉపయోగించాలని తెలిపారు.ల్యాబ్‌ శాంపిళ్లను క్రమం తప్పకుండా టీ-హబ్‌కు పంపించాలని ఆదేశించారు.పీహెచ్‌సీలో 24 గంటలూ అందుబాటులో ఉండే సిబ్బంది వివరాలు,నైట్‌ డ్యూటీ రోస్టర్‌ను ఆస్పత్రి వెలుపల స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు.తనిఖీలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.బి.రాజా రెడ్డి పాల్గొన్నారు.