EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • డీజే నిర్వాహకులకు పోలీసుల కౌన్సెలింగ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

    Author
    Posted By JANA CHARITRA
    | 16 Sep 2026, 09:12 PM | TELANGANA, వరంగల్
    డీజే నిర్వాహకులకు పోలీసుల కౌన్సెలింగ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

    *వరంగల్,గీసుకొండ మండలం,సెప్టెంబర్‌ 16*

    గణేష్‌ నిమజ్జన ఉత్సవాలను ప్రశాంతంగా,సురక్షితంగా నిర్వహించేందుకు గీసుకొండ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.ఇందులో భాగంగా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని డీజే మ్యూజిక్‌ ఆపరేటర్లు,సౌండ్‌ సిస్టమ్‌ నిర్వాహకులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ గణేష్‌ నిమజ్జనం సందర్భంగా డీజేలు,సౌండ్‌ సిస్టమ్‌ల వినియోగంపై అమల్లో ఉన్న న్యాయస్థానాల ఆదేశాలు,ప్రభుత్వ నిబంధనలు,పోలీస్‌ శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.అధిక శబ్దంతో డీజేలు నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు కలిగించడం,శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం చేయరాదని స్పష్టం చేశారు.ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులకు నిర్వాహకులు సహకరించాలని కోరారు.ప్రజల భద్రత,శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.కార్యక్రమంలో సీఐ ఎస్‌ఐలు పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.