EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

    Author
    Posted By JANA CHARITRA
    | 17 Sep 2026, 05:00 PM | TELANGANA, వరంగల్
    రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

    నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన భూ ఆరోపణలు పూర్తిగా అసత్యమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు.

    తాను భూ కబ్జాలకు పాల్పడినట్లు ఆధారాలు చూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. తమ వారసత్వ భూములను విక్రయించి రాజకీయాలు చేశానని, భూ కబ్జాలకు పాల్పడలేదని అన్నారు.

    భూ వ్యవహారాలపై ధైర్యం ఉంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధికారులను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడితే ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు.

    ఇవి కూడా చదవండి

    భూ వ్యవహారాలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని, అప్పుడు అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

    కేటీఆర్, హరీశ్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనే ఉద్దేశంతోనే తమ నాయకులను అసెంబ్లీకి రాకుండా కుట్రలు చేశారని ఆరోపించారు.

    కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ కోసం పదవులను వదులుకున్న త్యాగశీలి కేసీఆర్ అని పేర్కొన్నారు.

    తనపై, తమ నాయకులపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ముందుగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.