EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పేలుడు పదార్థాలు, పెట్రోలియం, సినిమాటోగ్రఫీ నిబంధనల ప్రకారం ఎన్‌ఓసీల జారీ ప్రక్రియ

    Author
    Posted By JANA CHARITRA
    | 18 Sep 2026, 01:40 PM | TELANGANA, వరంగల్
     పేలుడు పదార్థాలు, పెట్రోలియం, సినిమాటోగ్రఫీ నిబంధనల ప్రకారం ఎన్‌ఓసీల జారీ ప్రక్రియ

    పేలుడు పదార్థాలు, పెట్రోలియం, సినిమాటోగ్రఫీ నిబంధనల ప్రకారం ఎన్‌ఓసీల జారీ ప్రక్రియలో జాప్యం లేకుండా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ సూచించారు.వరంగల్ పోలీస్ కమిషనర్ కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి పాల్గొన్నారు. ఎన్‌ఓసీలకు సంబంధించిన నివేదికలను సకాలంలో అందించి, పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.సమావేశంలో మూడు జిల్లాలకు చెందిన పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక, భారత జాతీయ రహదారుల సంస్థ, జిల్లా వైద్యారోగ్య, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.