EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గజ్వేల్‌లో కొత్తగా తెలంగాణ విమోచన వేదిక

    Author
    Posted By JANA CHARITRA
    | 19 Sep 2026, 10:11 AM | TELANGANA, వరంగల్
    గజ్వేల్‌లో కొత్తగా  తెలంగాణ విమోచన వేదిక

    సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్ కన్వెన్షన్ హాల్‌లో గజ్వేల్‌లో కొత్తగా తెలంగాణ విమోచన వేదిక ఏర్పడింది ఈ వేదిక తన తొలి ప్రధాన కార్యక్రమంతో ప్రజా చర్చకు శ్రీకారం చుట్టిన సందర్భంగా నిలిచింది.
    కార్యక్రమం ప్రారంభానికి ముందు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి భారీ కటౌట్ ముందు 25 దీపాలను వెలిగించారు. ఆయన 25 ఏళ్ల ప్రజా జీవిత ప్రయాణాన్ని, ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ప్రజా సేవా ప్రస్థానం నుంచి ప్రధానమంత్రిగా కొనసాగుతున్న ప్రయాణాన్ని ప్రతీకాత్మకంగా స్మరించుకుంటూ ఈ దీపాలను వెలిగించారు. అనంతరం సంపూర్ణ “వందేమాతరం” గీతాన్ని ఆలపించగా, సభలోని ప్రతి ఒక్కరూ గౌరవంతో నిలబడి జాతీయ గీతానికి సంబంధించిన ప్రోటోకాల్‌ను పాటించారు.
    జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ విమోచన పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. దేశభక్తులు, ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువత, తెలంగాణ విమోచన ఉత్సవ సమితి సభ్యులు, గజ్వేల్ ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    విమోచన చరిత్రను నేటి తరానికి అందించాలి: దారం గురువారెడ్డి
    కార్యక్రమానికి వ్యాఖ్యాతగా, సమన్వయకర్తగా వ్యవహరించిన దారం గురువారెడ్డి మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఒక కీలకమైన చారిత్రక ఘట్టమని అన్నారు.

    నిజాం పాలనలో ప్రజలు ఎదుర్కొన్న పరిస్థితులు, రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రజలు, ఉద్యమకారులు సాగించిన పోరాటం, అనంతరం హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక పరిణామాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు.
    “విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం అంటే కేవలం ఒక చారిత్రక తేదీని గుర్తుచేసుకోవడం కాదు. ఆ పోరాటం వెనుక ఉన్న త్యాగాలను అర్థం చేసుకోవడం, స్వేచ్ఛ విలువను గుర్తించడం, దేశ నిర్మాణంలో మన బాధ్యతను గుర్తుచేసుకోవడం. ప్రారంభమైందని గురువారెడ్డి తెలిపారు. చరిత్ర, తెలంగాణ భవిష్యత్తు, యువత పాత్ర, అభివృద్ధి, భారతదేశ ఆర్థిక ప్రగతి వంటి అంశాలపై చర్చలు, బ్రెయిన్‌స్టార్మింగ్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వేదిక ఉద్దేశమని వివరించారు.
    ఈ వేదికను మరింత విస్తరించి, గజ్వేల్ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలను, ముఖ్యంగా యువతను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
    గ్రామాల పోరాటం నుంచి సర్దార్ పటేల్ నిర్ణయాత్మక చర్యల వరకు: నర్రా భూపతి రెడ్డి
    కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన శ్రీ నర్రా భూపతి రెడ్డి తన కీనోట్ ప్రసంగంలో తెలంగాణ విమోచన చరిత్రను విపులంగా వివరించారు.
    నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలోని అనేక గ్రామాల్లో ప్రజలు సాగించిన ప్రతిఘటన, స్థానికంగా జరిగిన పోరాటాలు, ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, నాటి చారిత్రక పరిణామాలను ఆయన వివరించారు. అనంతరం అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలు, వాటి అనంతరం హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక పరిణామాలను ఆయన వివరించారు.
    “1948 సెప్టెంబర్ 17 కేవలం క్యాలెండర్‌లో ఒక తేదీ కాదు.
    నాటి అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు, వారి స్ఫూర్తితో భవిష్యత్ తరాలకు మెరుగైన సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు
    తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భూపతి రెడ్డి అన్నారు.
    శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా ఆయన 25 ఏళ్ల ప్రజా జీవిత ప్రయాణాన్ని కూడా కార్యక్రమంలో ప్రస్తావించారు. ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ఆయన ప్రజా జీవితం, ప్రధానమంత్రిగా కొనసాగుతున్న ప్రస్థానం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, మౌలిక వసతులు, ప్రపంచ వేదికపై భారతదేశ స్థానం వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.

    2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంలో తెలంగాణ యువత, ప్రజలు తమ వంతు పాత్ర పోషించాల్సిన అవసరాన్ని వక్తలు వివరించారు.
    “భారతదేశం ఎదుగుతున్న చరిత్రను కేవలం చూస్తూ ఉండకూడదు. ఆ చరిత్రలో మనమూ భాగస్వాములం కావాలి.”
    యువతను మరింతగా భాగస్వాములను చేయాలన్నారు.
    మోటివేషనల్ స్పీకర్ శ్రీమతి హరిణి మాట్లాడుతూ, తెలంగాణ విమోచన ఉత్సవ సమితి ప్రారంభించిన కొత్త వేదికను అభినందించారు. చరిత్రను స్మరించుకోవడంతో పాటు సమాజానికి అవగాహన కల్పించడం, యువతలో దేశభక్తి, సామాజిక బాధ్యత, సృజనాత్మక ఆలోచనలను పెంపొందించడం వంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.
    కొత్త వేదికకు వక్తల అభినందనలు
    కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు తెలంగాణ విమోచన ఉత్సవ సమితి ఏర్పాటును అభినందించారు.
    కార్యక్రమంలో డాక్టర్ ఆకుల నరేష్ బాబు, ముఖ్య వక్త నర్రా భూపతి రెడ్డి, సీనియర్ నాయకులు మాదాడి జస్వంత్ రెడ్డి, ఉప్పల మధుసూదన్, కూడిక్యాల రాములు, వెంకట్ రెడ్డి, భాస్కర చారి, ఫణిధర్ రావు, వంగాల రంగాచారి మోటివేషనల్ స్పీకర్ హరిణి, సోమేశ్వర్ పంతులు తదితరులు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి

    తెలంగాణ విమోచన ఉత్సవ సమితి సభ్యులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు, యువకులు, మహిళలు, గజ్వేల్ పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
    వార్త
    ఓవర్
    ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా ఫ్రీలాన్స్ జర్నలిస్టు వంగాల రంగాచారి.