EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బత్తాయి పంటకు శాశ్వతమైన మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

    Author
    Posted By JANA CHARITRA
    | 19 Sep 2026, 10:59 AM |
    బత్తాయి పంటకు శాశ్వతమైన మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

    నల్గొండ జిల్లాలో నాలుగు దశాబ్దాల కాలంగా సాగవుతున్న వేలాది ఎకరాల బత్తాయి పంటను రైతు అమ్ముకోవడానికి నేటికి సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేదు. మధ్య దళారుల చేతుల్లోనే మార్కెట్ ఉండడంతో రైతులకు సరైన ధర రాక నష్టపోతున్నారు. తక్షణమే ఈ సమస్యకి శాశ్వతం మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.." అని బత్తాయి రైతు పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్ నల్గొండ జిల్లా కమిటీ
    కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు విజ్ఞప్తి చేసింది. బత్తాయి రైతు పరస్పర సహాయ సహకార సంఘం జిల్లా కమిటీ ఈ మేరకు శుక్రవారం హైదరాబాదు లో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేసింది.
    నాలుగు దశాబ్దాలు గడిచినా ప్రభుత్వం బత్తాయి రైతులకు సరైన మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయలేపోయిందని, బత్తా సాగు చేసే రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని కేంద్ర మంత్రికి వివరించారు. రైతలకు నాణ్యమైన పురుగు మందులు అందుబాటులో లేక పోవడంతో నాసీరకమైన పురుగు మందులు వాడాల్సి వస్తోందని, వాతావరణ మార్పుల వల్ల పంట దిగుబడి సరిగా రావడం లేదని పేర్కొన్నారు. పంటను కూడా సరైన ధరకు అమ్ముకోలేక బత్తాయి రైతులు అయోమయ పరిస్థితిలో ఉన్నారని , తక్షణమే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బత్తాయి రైతులను ఆదుకోవాలని కోరారు. ముఖ్యంగా ఓ. డి- ఓ. పి క్రింద (సిట్రస్ క్లాషర్) న్లగొండ జిల్లా అమలు చేయాలని,బత్తాయి రైతులకు ప్రత్యేకంగా ఎఫ్.పి.ఒ.ఏర్పాటు చేయాలని, నల్గొండ బత్తాయి మార్కెట్ కేంద్రంగా ఆటోమేటెడ్ గ్రేడింగ్ ట మిషన్ ఏర్పాటు చేయలని కోరారు.అదేమాదిరిగా ఢిల్లీ, చెన్నై మరియు కలకత్తా మార్కెట్లకు అనుసంధానం చేసి నల్గొండ బత్తాయి మార్కెట్ పునః ప్రారంభించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. వారిని కోరడం జరిగింది,ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు, నల్గొండ మాజీ శాసనసభ్యులు నంద్యాల నరసింహారెడ్డి, బత్తాయి రైతు పరస్పర సహాయ సహకార సంఘం సహాయ కార్యదర్శి నిర్మల్ రావు, కమిటీ సభ్యులు వాసుదేవ రెడ్డి , గుర్రం శ్రీనివాస్ రెడ్డి, ప్రవేశ్ సింగ్ బత్తాయి రైతులు హాజరయ్యా.