EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జిల్లాస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన ఉషోదయ హై స్కూల్ విద్యార్థులు" అభినందించిన డైరెక్టర్ గిరిగాని రాహుల్ వర్మ

    Author
    Posted By JANA CHARITRA
    | 19 Sep 2026, 11:03 AM | TELANGANA, వరంగల్
    జిల్లాస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన ఉషోదయ హై స్కూల్ విద్యార్థులు" అభినందించిన  డైరెక్టర్ గిరిగాని రాహుల్ వర్మ

    సంగెం,గీసుకొండ జోన్ ఆధ్వర్యంలో సంఘంలో నిర్వహించిన 70వ క్రీడా పాఠశాలల జోనల్ స్థాయి ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన ఉషోదయ హై స్కూల్ విద్యార్థులు కబడ్డీ క్రీడలో శివకుమార్, విష్ణు, రాహుల్, యశ్వంత్,రితిక్ లు ఖో ఖో క్రీడలో భువన్, అభిరామ్, రితిక్, శివతేజలు వాలీబాల్ విభాగంలో అరవింద్ ,శశివర్ధన్ ఉషోదయ హై స్కూల్ డైరెక్టర్ గిరి గాని రాహుల్ వర్మ అభినందించారు..
    ఈ సందర్భంగా ఉషోదయ హై స్కూల్ డైరెక్టర్ గిరిగాని రాహుల్ వర్మ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో విద్యార్థులకు ప్రతిరోజు క్రీడా శిక్షణ కార్యక్రమాలు పాఠశాలలో నిర్వహిస్తున్నామని దానికి అనుగుణంగానే ఈరోజు జోనల్ స్థాయి పోటీల్లో ఉత్తమ ఫలితాలు వచ్చాయని, జిల్లా స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు అభినందనలు తెలియజేస్తూ జిల్లా స్థాయిలో కూడా ఉత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపిక కావాలని తెలిపారు..
    ఈ యొక్క కార్యక్రమంలో ఉషోదయ హైస్కూల్ ప్రిన్సిపాల్ చంద్రగిరి మహేష్ , వైస్ ప్రిన్సిపల్ వీరన్న , వ్యాయామ విద్య ఉపాధ్యాయులు కుంట విజేందర్ గారు, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు