EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కాశిబుగ్గలో ఘనంగా మహా అన్నదానం

    Author
    Posted By JANA CHARITRA
    | 19 Sep 2026, 05:33 PM | TELANGANA, వరంగల్
    కాశిబుగ్గలో ఘనంగా మహా అన్నదానం

    కాశిబుగ్గ: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాశిబుగ్గ నవజ్యోతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోరంట్ల మనోహర్–మాధవి దంపతులు అన్నదాన వితరణ దాతలుగా వ్యవహరించారు.

    కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన BRS వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గణపతి నవరాత్రి ఉత్సవాల ప్రాధాన్యతను, అన్నదానం విశిష్టతను కొనియాడారు.

    అన్నదాన కార్యక్రమంలో భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

    ఇవి కూడా చదవండి

    ఈ కార్యక్రమంలో బేతి అశోక్ బాబు, ఉరుగొండ రవీందర్, గుల్లపల్లి కుమార్ సాగర్ పవన్, వివేక్, నాగరాజు, చింటూ, ముల్క సురేష్, ప్రసాద్ బొద్దుల కుమార్ తదితరులు పాల్గొన్నారు.